సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ శౌరిరెడ్డి కి నివాళులు అర్పించిన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి
NLG: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ గాదె శౌరిరెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఈరోజు నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుంభం రామ్ రెడ్డి పాల్గొని.. శౌరిరెడ్డి చిత్రపటానికి పుష్పాలను సమర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వ్యాయామ విద్య విభాగానికి, మరియు ఎంతోమంది యువతీ యువకులను గొప్పక్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో శౌరిరెడ్డి పాత్ర చాలా గొప్పదని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కుంభం నర్సిరెడ్డి, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, లింగయ్య, రాములు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 21న ఆలేరు లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ: ఈనెల 27 నుండి 30 తేదీ వరకు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 10 వ రాష్ట్రస్థాయి పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు.
దానికి అనుగుణంగా ఈనెల 21 న ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నామని, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనదలచిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు జాయింట్ సెక్రెటరీ గడసంతుల మధుసూదన్ (సెల్ నెంబర్ 90009-89671) మరియు అసిస్టెంట్ సెక్రటరీ మద్ది కర్ణాకర్ (సెల్ నెంబర్ 94925-72900) లను సంప్రదించాలని సూచించారు.
నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీ ఆవిష్కరణ శనివారం జరిగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో వారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, ఆధ్వర్యంలో టి యు డబ్ల్యూ జే -143 నాంపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, ఎరెడ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Apr 13 2024, 18:03